నా ఫిట్‌నెస్ రహస్యం ఇదే..
‘లక్కీ భాస్కర్’ చిత్ర ంతో టాలీవుడ్‌లో మంచి నేమ్, ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆ సినిమా తరువాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆమె అలరించారు. ఒకే నెలలో వరుస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక జనవరిలో వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకుల ముం దుకు రానున్నారు. ఎప్పుడూ చలాకీగా, స్లిమ్‌గా, ఫిట్గా ఉండే మీనాక్షిని చూస్తే ఎవరైనా ఫిదా అవుతారు. అసలు అంతలా ఫిట్‌నెస్ ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నారా? అనిపిస్తుంది. తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తాజాగా మీనాక్షి బయటపెట్టారు. తన తండ్రి కారణంగానే తానింత ఫిట్‌గా ఉన్నానంటూ మీనాక్షి వెల్లడించారు. చిన్నప్పటి నుంచి ఆమెను గేమ్స్ ఆడేలా ప్రోత్సహించేవారట. తన వెంటే ఉంటూ స్పోర్ట్స్‌లో ట్రైనింగ్ ఇప్పించేవారట. అలా స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ లో స్టేట్ లెవల్‌లో మీనాక్షి ఆడారట. స్పోర్ట్స్ పర్సన్ కాబట్టే మీనాక్షి అంత ఫిట్ గా ఉన్నారు.






