శంబాల కొత్త డేట్ ఇదే
ఆది సాయికుమార్ హీరోగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రంపై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌తో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. సినీప్రియులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌తో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఆది కనిపించిన తీరు, అందులో ఓ కుక్క, వెనకాల పొగతో ఏర్పడిన ఓ ఆకారం సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగేలా ఉంది. ప్రస్తుతం వేగంగా పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుపుకొంటున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కే బంగారి డీవోపీగా పనిచేయగా, శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్నారు.




