19-10-2025 12:26:15 AM
ఒకప్పుడు నవలలను సినిమాగా తెరపైకి తీసుకు వస్తుండేవారు. కొంత కాలంగా ఆ తరహా సినిమాల సంఖ్య తగ్గిపోయింది. అయితే, ప్రముఖ రచయిత పూర్ణచంద్ర తేజస్వి ప్రసిద్ధ నవల ‘జుగారి క్రాస్’ను సినిమాగా రూపొందిస్తున్నారు. ‘కరావళి’ దర్శకుడు గురుదత్త గనిగ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. రాజ్ బీ శెట్టి ప్రముఖ పాత్రను పోషిస్తున్న ‘కరావళి’ మూవీ విడుదలకు ముందు గురుదత్త గనికి, రాజ్ బీ శెట్టి కాంబోలో మరోచిత్రం ప్రారంభమైంది. అదే ‘జుగారి క్రాస్’. ఈ కొత్త టైటిల్‌ను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన టైటిల్ ప్రోమో ఆకట్టుకుంటోంది.
ఇందులో చూపించిన పుర్రెలు, పారే రక్తం, మారణాయుధాలు చూస్తుంటే భారీ యాక్షన్ చిత్రంగా రానున్నట్టు కనిపిస్తోంది. రాజ్ బీ శెట్టి ప్రత్యేకమైన, అసాధారణమైన పాత్రలను చేస్తూ విజయాన్ని అందుకుంటున్నారు. చివరగా ‘సు ఫ్రమ్ సో’లో గురూజీగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇక త్వరలోనే ‘కరావళి’లో మరో అద్భుతమైన పాత్రతో మెప్పించబోతోన్నారు. ఈ మూవీ విడుదల కాకముందే ఈ దర్శకుడు, రాజ్ బీ శెట్టి కలిసి ఇప్పుడు ‘జుగారి క్రాస్’ అనే శకిమంతమైన ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది.