22 June, 2026 | 2:37 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •  

అన్ని వయసులవారిని ఆకట్టుకునేలా లవ్ థీమ్ సాంగ్స్

19-10-2025 12:23 AM

ప్రేమ, విరహం వంటి సున్నితమైన అంశాలతో యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందింది ‘నీవే నా తొలి ప్రేమ’ మ్యూజికల్ ఆల్బమ్. ఇందులో హరీశ్ దాచేపల్లి, సాయి నీరజ ప్రధాన పాత్రల్లో నటించారు. జగదీశ్ కీలక పాత్ర పోషించారు. ఈ ఆల్బమ్‌కు ప్రముఖ సినీ దర్శకుడు తాజుద్దీన్ దర్శకత్వం వహించడంతోపాటు, గీత సాహిత్యాన్ని కూడా అందించారు. సమర సింహ సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటింగ్, డీఐగా బాధ్యతలను జగదీశ్‌కుమార్ నిర్వర్తించారు.

ప్రశాంత్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నరేశ్, సందీప్ ఇతర సాంకేతిక సహకారం అందించారు. ‘లవ్ అండ్ బ్రేకప్’ అనే థీమ్‌తో రూపొందించిన ఈ థీమ్ సాంగ్స్ ఆల్బమ్ తెలుగు వెర్షన్‌ను ప్రముఖ డైరెక్టర్, తెలుగు సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు భోలే షావలి వేర్వేరుగా ఆవిష్కరించారు. త్వరలోనే ఈ పాటలు అన్ని డిజిటల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానున్నాయని వెన్ ల్యాక్స్ ప్రొడక్షన్స్ అధినేత దాచేపల్లి హరీశ్ వెల్లడించారు.