13 July, 2026 | 1:00 AM

ఈ నేల అసురుడిది కాదురా..ఈశ్వరుడిది

12-12-2024 12:00 AM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందనున్న చిత్రం ‘అఖండ 2. వీరిద్దరి కాంబోలో నాలుగవ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందనుంది. తేజస్విని నందమూరి సమర్పణలో ప్రతిష్టాత్మక 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఘనంగా లాంచ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్‌లో భాగంగా ఇవాళ బాలకృష్ణ చిత్రీకరణలో పాల్గొన్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ ఈ ఫైట్ సీక్వెన్స్‌ని సూపర్ వైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ లాంఛింగ్ ఈవెంట్ నుంచి ఒక వీడియోను రిలీజ్ చేశారు.“ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది.. పరమేశ్వరుడిది. కాదని తాకితే జరిగేది తాండవం.. అఖండ తాండవం..” అంటూ బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్‌ని చెప్పారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలోని నటీనటులను పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.