13 July, 2026 | 1:59 AM

2025లో ప్రేమనందించే భాగస్వామి

12-12-2024 12:00 AM

సమంత తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆమె కూడా తను పెట్టిన పోస్ట్‌లో ఉన్నది జరగాలనుకుంటున్నట్టు తెలిపారు. దీంతో ఆ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. తన రాశికి 2025 ఎలా ఉంటుందో తెలిపే సందేశాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా అందులో ఉన్న విధంగా జరగాలని కోరుకుంటున్నట్టు సైతం తెలిపారు. ‘2025లో వృషభ, కన్య, మకర రాశి వారు వీటిని పొందే అవకాశం ఉంది’ అన్నట్టుగా సమంత పెట్టిన పోస్ట్‌లో ఉంది. “ఏడాదంతా బిజీగా ఉంటారు. వృత్తిపరంగా మెరుగుపడటమే కాకుండా డబ్బు బాగా సంపాదిస్తారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని, పిల్లలను పొందుతారు” వంటి అంశాలున్నాయి. ఇవన్నీ తన జీవితంలో జరగాలని కోరుకుంటున్నట్టు సమంత వెల్లడించారు. సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రాబోయే సిరీస్ కోసం ఫాంటసీ ప్రపంచంలోకి సమంత అడుగు పెడుతున్నారు. ‘రక్త్ బ్రహ్మండ్’ అనే వెబ్ సిరీస్‌లో సమంత ప్రస్తుతం నటిస్తన్నారు. తాజాగా ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్’ సెట్లోకి అడుగు పెట్టినట్టు సమంత తెలిపారు.