ఈ కార్యదర్శి మాకొద్దు!
- పంచాయతీ పనుల నిర్వహణలో కార్యదర్శి నిర్లక్ష్యం
- నెలకు రెండు రోజులే చెత్త సేకరణ
- బిల్లు వచ్చి పది రోజులు గడిచినా చెక్కు ఇవ్వని పంచాయతి కార్యదర్శి
- పద్ధతి మార్చుకోవాలని సూచించిన అధికారులు
- ఆదేశాలు భేఖాతరు చేస్తున్న కార్యదర్శి
- ఇబ్బందులు పడుతున్న అనంతరావుపల్లి గ్రామస్తులు
గజ్వేల్, సెప్టెంబర్ 2 : స్థానికంగా సర్పంచులు లేని సమయంలో గ్రామ పరిపాలన పటిష్టంగా నిర్వహించాల్సిన పంచాయతీ కా ర్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీంతో ఈ పంచాయతీ కార్యదర్శి మాకొద్దంటూ గ్రామస్తులు మొత్తుకుంటున్నారు. గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలందరినీ ఇబ్బందులకు గురిచేస్తుందని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈమేరకు నాలుగైదు సార్లు ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడంతో ఎంపీడీవో సైతం పంచాయతీ కార్యదర్శి జ్యోతికి పద్ధతి మార్చుకోవాలని సూ చించారు. అయినా ఆమె వైఖరిలో ఏలాంటి మార్పు రాలేదు. గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేయకుండా పిచ్చి మొక్కలు సైతం తీవ్రంగా పెరిగిపోవడంతో దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా రు. గ్రామంలో హరితహారం కింద నాటిన మొక్కలు కూడా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పూర్తిగా చచ్చిపోయాయి.
స్థానికంగా ఉపాధి హామీ పనులు నిర్వహించి ఏడాది పూర్తి కాగా సంబంధిత బిల్లులు పది రోజుల క్రితం గ్రామ ఖాతాలో పడ్డాయి. నాటినుండి నేటి వరకు డబ్బులకు సంబంధించిన చెక్కులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి జ్యోతిని పనులు నిర్వహించిన దామరమైన మల్లేశం ఫోన్ చేసి కోరుతుండగా, కొద్దిరోజులు చెక్కులు రాలేదంటూ సమాధానం ఇవ్వగా, మూడు రోజులుగా అతని ఫోన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మల్లేశం సమస్యను ఎంపీడీవో ప్రవీణ్ కు వెల్లడించారు.
ఎంపీడీవో ఫోన్ చేసినా కూడా పంచాయతీ కార్యదర్శి జ్యోతి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. గ్రామంలో నిర్వహించే గ్రామసభలు గానీ, ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం అందించే లబ్ధినిగాని ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. పంచాయతీ కార్యదర్శి జ్యోతి వైఖరి పట్ల విసుకు చెందిన గ్రామస్తులు ఈ పంచాయతీ కార్యదర్శి మాకొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెందాలేసి జీతం ఇస్తాం.. కానీ మా ఊరికి మీరొద్దు..
తమ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పట్టించుకోకపోవడమే కాకుండా గ్రామంలో సమస్యలను ఏవి కూడా పంచాయతీ కార్యదర్శి పరిష్కరించడం లేదని, కార్యదర్శిని ప్రజలు గట్టిగా నిలదీస్తే తనను తిట్టారంటూ గ్రామస్తులపై పోలీస్ స్టేషన్లో గతంలో రెండు సార్లు కేసులు పెట్టిందని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికీ అలాగే బెదిరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామస్తులు, అనంతరావుపల్లి
చాలాసార్లు చెప్పాం.. వైఖరి మార్చుకోవడం లేదు..
అనంతరావుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి జ్యోతి ప్రజల సమస్యలను పట్టించు కోవడంలేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్యదర్శిని పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని సూచించాం. గ్రామ ప్రజా ప్రతినిధులు కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు యగా మరోసారి కూడా ఆదేశించాం.
ప్రవీణ్, ఎంపీడీవో






