8 August, 2026 | 12:16 AM

కేసిఆర్ కు అందరూ సమానులే

02-09-2025 10:29 PM

రక్తసంబంధీకులైనా, పార్టీ నాయకులైనా ఒక్కటే..

నకిరేకల్,(విజయక్రాంతి): రక్తసంబంధీకులైనా, పార్టీ నాయకులైనా ఒక్కటేనని  చాటి చెప్పిన  ఆదర్శ మహనేత కేసీఆర్ అని కవితా సస్పెన్షన్ పై స్పందిస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  పార్టీ నిర్ణయాలే శిరోధకం కుటుంబ సభ్యులమని ఇష్టానుసారం మాట్లాడడం సమంజసం కాదని కవిత సస్పెన్షన్ పై  ఆయన స్పందించి  పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకోవటంసమర్ధనీయమేఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ సీఎం కావాలని ప్రజలంతా భావిస్తున్న తరుణంలో బహిరంగంగా  విమర్శించడం కవిత వ్యాఖ్యలు సరికాదు అన్నారు. కవిత వెనుక ఎవరు ఉన్నారో అందరికీ అర్థం అవుతోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలనే కవిత చేస్తూ వస్తోందని వాళ్ళు ఆడిస్తున్న నాటకం అన్నారు. ఇరవై నెలలుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై హరీష్ రావు, కేటీఆర్. పార్టీ పోరాడుతుంటే  కవిత వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.

అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి తప్ప బహిరంగ విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. పార్టీ సుప్రీమ్ పార్టీ నిబంధనలప్రకారం ఎంతటి వారైనా పనిచేయాల్సిందని ఆయన తెలిపారు.కవిత సస్పెండ్ తో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు అన్నారు.అందరం కలిసి బిఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దామని ఆయన పేర్కొన్నారు