వైఎస్ సేవలు చిరస్మరణీయం
03-09-2025 12:00 AM
సిద్దిపేట రూరల్, సెప్టెంబరు 2 : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని ఆర్టిఏ డైరెక్టర్ సూర్య వర్మ అన్నారు. మంగళవారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించి రాజశేఖర్ రెడ్డి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యవర్గ సభ్యులు దారిపల్లి చంద్రం, డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు మంద పాండు, అధికార ప్రతినిధి ముత్యాల బుచ్చిరెడ్డి, నాయకులు దాసరి రాజు, చంద్రశేఖర్, సదాశివరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






