5 March, 2026 | 9:17 AM

ఈసారి ఎండలెక్కువే

05-03-2026 12:14 AM

ఉత్తర తెలంగాణలో అధిక తీవ్రత

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): గతేడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తం గా బుధవారం సగటున 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మూడు రోజులు 2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఎండ తీవ్రతతో ఉక్కపోత ఎక్కువ అవుతోంది.