18 April, 2026 | 11:50 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఈ ఏడాదీ ఈపీఎఫ్ వడ్డీ 8.25 శాతమే!

03-03-2026 12:49 AM

చందాదారుల నిధిపై ఇవ్వనున్న ఈపీఎఫ్‌ఓ

కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో సీబీటీ నిర్ణయం

అనెక్లెయిమ్డ్ ఖాతాలు 1.33 లక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గత సంవత్సరం లాగే ఈ ఆర్థిక సంవత్సరం ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్)పై 8.25 శాతమే వడ్డీ ఇస్తామని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం జరిగిన 239వ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల(సీబీటీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక మం త్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వం వహించారు. గత సంవత్సరంలోనూ ఇంతే వడ్డీరే టు ఇవ్వగా 2025 ఆర్థిక ఏడాదికి అదేశాతం ఇస్తూ..

ఎలాంటి  మార్పులు చేయ లేదు. 2025 ఆర్థిక సంవత్సరానికి భవి ష్య నిధి చందాదారుల నిధిపై 8.25% వడ్డీ రేటు జమ చేయాలని సోమవారం జరిగిన సమావేశంలో సీబీటీ నిర్ణయించిందని సం బంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు వడ్డీ రేటుకు సంబంధించి సీబీటీ ప్రతిపాదనను కేంద్ర ఆర్థికశాఖకు పంపనున్నారు. ప్రభుత్వం అధికారికంగా వడ్డీరేటును నోటిఫై చేశాక, ఈపీఎఫ్ చందాదారు ఖాతాలకు వడ్డీ మొత్తం జమవుతుంది.

ప్రస్తుతం ఈపీఎస్‌ఓలో 7 కోట్ల మందికిపైగా చందాదారులు న్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై వడ్డీ రేటు 8.15 శాతం కాగా, 2023- 8.25 శాతానికి పెంచారు. అప్పటి నుంచి అదే వడ్డీరేటును కొనసాగిస్తున్నారు. నిస్తేజంగా ఉన్న ఖాతాల్లోని అనెక్లె యిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి కూడా సీబీటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో రూ.వెయ్యి కంటే తక్కు వ మొత్తాలు కలిగిన 1.33 లక్షల ఖాతాలను గుర్తించారు. మొత్తం రూ.5.68 కోట్లను సెటిల్ చేయనున్నారు.