calender_icon.png 8 February, 2026 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవాలి

06-02-2026 12:00:00 AM

జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఇలా త్రిపాఠి

కామారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల కోసం పోస్టల్ బ్యాలెట్  ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు  ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  పోస్టల్ బ్యాలెట్ను ఎంచుకున్న ఎన్నికల విధుల్లో నియమితులైన సిబ్బంది ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేందుకు, కామారెడ్డి జిల్లాలోని క్రింది పట్టణ స్థానిక సంస్థలలో 6,7,8 తేదీలలో పోస్టల్ బ్యాలెట్  ఓటరు సౌకర్యాల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ ఫెసిలి టేషన్ సెంటర్లు,కామారెడ్డి మున్సిపాలిటీ  మున్సిపల్ కార్యాలయం, కామారెడ్డి బాన్సువాడ మున్సిపాలిటీ  మున్సిపల్ కార్యాలయం, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీ ZPHS స్కూల్, కొత్త భవనం, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీ  మున్సిపల్ కార్యాలయం, ఎల్లారెడ్డి  ఎన్నికల విధుల్లో నియమించబడిన సిబ్బంది ఈ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇంచార్జి జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాటి తెలిపారు.