06-02-2026 12:00:00 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు 2026 నిమిత్తం కామారెడ్డిలో జరుగుతున్న బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, నాణ్యత, భద్రతా ప్రమాణాలు, సీల్ విధానం, లెక్కింపు , ప్యాకింగ్ ప్రక్రియలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరగాలని సూచించారు, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎన్నికల విభాగానికి చెందిన సంబంధిత అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.