calender_icon.png 8 February, 2026 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీవో

06-02-2026 12:00:00 AM

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): మండలంలోని పల్లె బోగుడ తండా గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అలాగే గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను, అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తనిఖీ చేసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులు కొలతల ప్రకారం పొడవు వెడల్పు సరిగా వచ్చేలా చేపట్టాలని, గ్రామంలోని జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఉపాధి హామీ పనులకు హాజరుకావాలని తెలిపారు.రానున్న రోజుల్లో ఎండలు ఎక్కువగా ఉండవచ్చు కనుక సమయానుసారం ఉపాధి హామీ పనులకు పాల్గొని ఉపాధి పొందాలన్నారు.

అలాగే గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తిచేయాలని, గ్రామ పరిధిలో ఉన్న అంగన్వాడి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి ఆహారాన్ని అందించాలని అన్నారు. రానున్న వేసవికాలంలో గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా నీటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  ధనావత్ పార్వతి బాయ్ శంకర్, కార్యదర్శి సుజాత, ఫీల్ అసిస్టెంట్ ఫర్వీనా బేగం, కూలీలు, గ్రామస్తులు ఉన్నారు.