calender_icon.png 30 September, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ‘ఈవీ’లే రోడ్లపైకి రావాలి

30-09-2025 12:53:55 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ప్రస్తుతం భారతీయ వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) హవా ఎక్కువగా కనిపిస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాలపై వస్తున్న ప్రధానమైన ఫిర్యాదు ఏంటంటే.. అవి రోడ్లపై వెళ్తున్నప్పుడు ఏమాత్రం చప్పుడు రావడం లేదని, దీంతో వెనుక ఏ వాహనం వస్తుందో.. ముందు వెళ్లే వాహనదారులకు తెలియడం లేదు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పరిష్కారం కనుగొన్నది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నాటికి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు వెహికిల్ అలర్ట్ సిస్టమ్ (ఏవీఏఎస్) అమర్చాల్సిందేనని స్పష్టం చేసింది. అందుకు ఈ ఏడాది నుంచి కంపెనీలు ఏవీఏఎస్ అమర్చే మార్కెట్లోకి వాహనాలు విడుదల చేయాలని సూచించింది.