calender_icon.png 30 September, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ్ కావాలనే ఆలస్యంగా వచ్చారు

30-09-2025 12:56:31 AM

  1. అందుకే తొక్కిసలాట 
  2. కరూర్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు

చెన్నై, సెప్టెంబర్ 29: టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ ఉద్దేశపూర్వకంగా కరూర్ కార్నర్ సభకు ఆలస్యంగా రావటం వల్లనే దుర్ఘటన జరిగిందని తమిళనాడు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. శనివారం రాత్రి కరూర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఘటనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి.

‘విజయ్ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఉదయం 11 గంటలకే జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. మధ్యాహ్నం ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉండగా, విజయ్ సాయంత్రం ఏడు గంటలకు వచ్చారు. భారీ జనసందోహాన్ని చూపించడానికే ఆయన ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారు. మధ్యా హ్నం నుంచి ఎండలో నించున్న ప్రజలు అలసిపోయారు.

విజయ్ తన బస్సు షెడ్యూల్‌ను మీరి, తనకు నచ్చిన చోట్ల బస్సు ఆపా రు. బస్సు నిలిపేందుకు కూడా సరైన అనుమతులు లేవు. బస్సు యాత్ర కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది’ అని ఎఫ్‌ఐఆర్‌లో రాసి ఉంది. అలాగే ప్రచార సభకు వచ్చిన వారికి తాగునీరు, ఆహారం లేవంటూ యంత్రాంగం చేసిన సూచనలను పార్టీ అధినేత విజయ్ కానీ, పార్టీ నేత ఆనం ద్ కానీ పట్టించుకోలేదని పేర్కొంది. పార్టీల నేతలు ఆరోపించారు.

విజయ్ ఏడు గంట లు ఆలస్యంగా రావడం వల్లే నియంత్రించలేనంత జనం గుమికూడారని, ఆ పరిస్థితులే తొక్కిసలాకు దారితీశా యని ఉంది. కరూర్ తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ పోలీసులు టీవీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్‌కుమార్, కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శిపై కేసులు నమోదు చేశారు. తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర ఉం దని, విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని టీవీకే పార్టీ ఆరోపించింది.

విజయ్ కరూర్ చేరుకున్న సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని, విజయ్‌ని చూసేందుకు అభిమానులు ముందుకు రావడంతోనే తొ క్కిసలాట జరిగిందని పేర్కొంది. తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందని ప్రకటించింది. టీవీకే ఆరోపణలపై తమిళనాడు విద్యుత్ బోర్డు స్పందించింది.

విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని టీవీకే నేతలే తమకు వినతిపత్రం ఇచ్చారని, అందుకు తాము అంగీక రించలేదని స్పష్టం చేసింది. మరోవైపు ఘటనపై తమిళనాడు ప్రభుత్వమూ స్పందిం చింది. తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద విద్యు త్ కోత లేదని స్పష్టం చేసింది.