30-09-2025 12:51:05 AM
ముంబై, సెప్టెంబర్ 29: ఉత్తరప్రదేశ్‌లో మొదలైన ‘ఐ లవ్ ముహమ్మద్’ వివాదం మహారాష్ట్రకూ పాకింది. ఆదివారం రాత్రి అహల్యానగర్ పరిధిలోని మిలివాడ రహదారిపై కనిపించిన గ్రాఫిటీ డిజైన్ రెండు వర్గాల మధ్య చిచ్చురాజేసింది. గ్రాఫిటీ ఫొ టోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోమవారం ఉదయం ఆ ప్రాంతం అట్టుడుకింది. వేలాది మంది ము స్లిం యువకులు అహిల్యానగర్- శంభాజీ హైవేను దిగ్బంధించి రాస్తారోకో చేపట్టారు.
తోఫ్‌ఖానా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రాఫిటీ వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకదశలో పోలీస్, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు రా ళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జి చేయా ల్సి వచ్చింది. పోలీసులు సుమారు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గ్రాఫిటీ డిజైన్ వేసిన వ్యక్తిని కూడా పో లీసులు అరెస్టు చేశారు. ఉద్రిక్తల వెనుక కు ట్ర ఉండవచ్చని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దే వేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.