30 June, 2026 | 10:35 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

నీట్ పేపర్ లీక్‌లో బాధ్యులను శిక్షించాలి

13-05-2026 12:00 AM

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు

హైదరాబాద్, మే 12(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన అత్యంత దురదృష్టకరమని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు తుంగ బాలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టప డి చదివి పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రశ్నాపత్రాలు లీక్ అవడం వల్ల వారి శ్రమ వృథా అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి, లీకేజీలు వరుసగా జరుగుతున్నాయని విమర్శించారు.  పేపర్ లీక్‌కు పాల్పడిన దొంగలను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఈ వ్యవహారంలో ఉన్న పెద్దల పాత్రను కూడా బయటపెట్టాలని తుంగ బాలు డిమాం డ్ చేశారు.