16 April, 2026 | 9:09 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

05-02-2026 12:52 AM

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్‌నగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి):-- మీకు నేను అండగా ఉంటాను... మీరు ఎవరికి భయపడొద్దు...ధైర్యంగా ఉండండి... అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లోని దాసారం బస్తీ గుడిసె వాసులకు హామీ ఇచ్చారు. బుధవారం గుడిసె వాసులపై ప్రయివేట్ వ్యక్తులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకు న్నారు.

దాడికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సార్ నగర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి ని ఆయన ఆదేశించారు. గత 30 సంవత్సరాల నుండి ఇక్కడే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న వీరిని ఇక్కడి నుండి ఖాళీ చేయించి ఈ స్థలాన్ని ఆక్రమించాలని కొం దరు వ్యక్తులు ప్రయత్నిస్తూ వస్తున్నారని వివరించారు.

గుడిసె వాసులను ఖాళీ చేయిం చేందుకు భయబ్రాంతు లకు గురిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. గుడిసె వాసుల జోలికి వెళ్లవద్దని ఇటీవల కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ పేపర్‌ను సీఐకి ఎమ్మె ల్యే అందజేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.