16 April, 2026 | 9:09 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఎన్‌ఎంఆర్ యువసేనకు బిగ్ షాక్

05-02-2026 12:53 AM

హరీష్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్లో చేరిక 

జిన్నారం/అమీన్ పూర్, ఫిబ్రవరి 4 : జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని ఊట్ల గ్రామ మాజీ ఉపసర్పంచ్, ఎన్‌ఎంఆర్ యువసేన నాయకుడు పట్లోళ్ల ప్రతాప్ రెడ్డి, ఎన్‌ఎంఆర్ యువసేన సీనియర్ నాయకులు బొగురు బాలేష్, కీర్తి నాగరాజు, బుషి శ్రీశైలం మొదలగు నాయకులు కాంగ్రెస్ పార్టీకి, ఎన్.ఎం.ఆర్ యువసేనకు రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో చేరారు. వీరికి పార్టీ కండవవేసి పార్టీలోకి ఆహ్వానించారు.

వీరితో పాటు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, రాష్ట్ర నాయకుడు వెంకటేష్ గౌడ్, బొల్లారం సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పిటిసి సభ్యులు కొలను బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీపడుతున్న కౌన్సిలర్లను భారీ విజయంతో గెలిపించాలని కోరారు. బిఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల మహేష్, గ్రామకమిటి అధ్యక్షుడు కప్పెర మహేష్ తదితరులు పాల్గొన్నారు.