1 July, 2026 | 9:25 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పద్మశ్రీ గ్రహీతలకు రూ.25 వేల పింఛన్

23-07-2024 01:28 AM

జీవో జారీ చేసిన ప్రభుత్వం 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25వేల పింఛన్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని సోమవారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కనుమరుగు అవుతున్న కళలు గుర్తించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీనెల రూ. 25వేల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ.. జీవో జారీ చేశామని పేర్కొన్నారు.  పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీతలకు రూ. 25 వేల పెన్షన్ ఇస్తామని  సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు.