20 May, 2026 | 6:02 PM

పోలీసులమని బెదిరింపు.. ఇద్దరి అరెస్టు

20-05-2026 12:00 AM
  1. ఐపీఎల్ టికెట్లు కొంటామని బురిడీ
  2. ఎస్‌వోటీ పోలీసులమని బెదిరింపులు

ఎల్బీనగర్, మే 19 (విజయక్రాంతి): ఎస్‌వోటీ పోలీసులమని బెదిరించి ఆశిష్‌రెడ్డి అనే విద్యార్థి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా డబ్బులు వసూళ్లు చేసిన ఇద్దరిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 16న అల్మాస్‌గూడకు చెందిన ఆశిష్‌రెడ్డి  ఐపీల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేశాడు.

పరీక్షలు ఉండడంతో స్నాప్‌చాట్‌లో టిక్కెట్లు అమ్మకానికి పెట్టాడు. టిక్కెట్లు కొనుగోలు చేస్తామంటూ ఇద్దరు అతన్ని కలిసి ఎస్‌వోటీ పోలీసులమని చెబుతూ బెదిరింపులకు దిగారు. ఆశిష్ రెడ్డి వెంటనే సరూర్‌నగర్  పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ శేఖర్ తన సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టారు.

18వ తేదీన సాయంత్రం ప్రాంతంలో సైదాబాద్ కాలనీ వద్ద నిందితులు కె.శివప్రసాద్, సాకేత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి నుంచి  బలవంతంగా ట్రాన్సఫర్ చేసుకున్న రూ. 7 వేల నగదు, ఇద్దరి నుంచి రెండు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన క్రైమ్ ఎస్‌ఐ మహేందర్, సిబ్బంది హనుమంతు, శివకృష్ణ, మోతీరామ్, రమేశ్ తదితరులను సరూర్‌నగర్ సీఐ శ్రీశైలం అభినందించారు.