హైదరాబాద్ అభివృద్ధికి మూడు కార్పొరేషన్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
శేరిలింగంపల్లి, జూన్ 8 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర అభివృద్ధి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్ప ష్టం చేశారు. ఐటీ కారిడార్లోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు మియాపూర్లో రూ.1,674.74 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. మియాపూర్ ఫ్లైఓవర్ ఇంటర్సెక్షన్, బాచుపల్లి ఫ్లైఓవ ర్ (రూ.530కోట్లు) ప్రారంభించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కా ర్యాలయానికి శంకుస్థాపన చేశారు.
మాదాపూర్ లాంటి ఐటీ కారిడార్కు మహర్దశ..
కొత్త అభివృద్ధి పనులతో హైదరాబాద్ ఐటీ కారిడార్కు మహర్దశ కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. బెంగళూరు ట్రాఫిక్ సమస్యలు, ఢిల్లీ కాలుష్యం, కోల్కతా-ముంబై వరదలు, చెన్నైలో శాంతి భద్రతల సమస్యలు హైదరాబాద్కు రాకుండా ముం దస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ, కాలుష్యకారక పరిశ్రమల తరలింపు, మూడు కార్పొరేషన్ల ఏర్పాటు వంటి చర్యలు ఇందు లో భాగమని తెలిపారు. రాయదుర్గం నుంచి లియో పోలీస్ వరకు మెట్రో విస్తరణ చేపడతామని ప్రకటించారు. ఈ ప్రాంతంలో ఎక రం భూమి ధర రూ.200 కోట్లకుపైగా ఉం దని, అందుకే అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అందించాల్సి ఉందన్నారు. గాజులరామారం వద్ద 100 ఎకరాల్లో అంతర్జాతీ య బస్ టెర్మినల్ నిర్మిస్తామన్నారు.






