5 August, 2026 | 10:00 AM

మహాలక్ష్మి దేవి అలంకరణలో ముగ్గురమ్మలు

26-09-2025 10:20 AM

వలిగొండ, (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల త్రిశక్తి క్షేత్రంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి  ఉత్సవాల్లో  భాగంగా ఐదవ రోజు అమ్మవార్లు మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి  అమ్మవార్లను  ఆకుపచ్చ రంగు వస్త్రాలతో అలంకరించి  ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహాలక్ష్మి దేవి అవతారంలోని అమ్మవారిని పూజించినట్లయితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద సంస్కృతి పరిషత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.