calender_icon.png 26 September, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లపై ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెర

26-09-2025 10:18:57 AM

దసరా లోపే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్

వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై గత మూడు రోజుల నుండి సస్పెన్స్ కొనసాగిస్తుండడంతో ఆశావాహులతోపాటు, జనంలో కూడా ఉత్కంఠత నెలకొంది. రిజర్వేషన్లపై గ్రామాల్లో విపరీతమైన చర్చలు కొనసాగుతుండడంతో ఆశావాహలలో రోజురోజుకు టెన్షన్ నెలకొంది. అయితే ప్రభుత్వం శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై చర్చించి మరికొద్ది గంటల్లో రిజర్వేషన్లను తెలియజేసే అవకాశం ఉండడంతో ఉత్కంఠతకు  తెరపడనుంది. రిజర్వేషన్లు ప్రకటించిన అనంతరం దసరా లోపు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.