11-11-2025 01:33:04 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో(Nellore) కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. వేగంతో దూసుకొచ్చిన కంటైనర్ అదుపుతప్పి టాటా ఏస్ వాహనం, మూడు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కంటైనర్ లారీ చేపల లోడుతో వెళ్తుంది. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదనాకి కారణమని పోలీసులు పేర్కొన్నారు.