calender_icon.png 11 November, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: 1 గంట వరకు 31.94 శాతం పోలింగ్

11-11-2025 02:00:53 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్(Jubilee Hills by-election ) కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా కొనసాగుతోంది. భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు 31.94శాతం(Jubilee Hills by-election polling percentage) పోలింగ్ నమోదైంది. 4.01 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోని, బరిలో ఉన్న 58 మంది అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. జూబ్లీహిల్స్ లో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

92 ఏళ్ల వయసులో లక్ష్మీ దేవమ్మ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచారు. ఆమె ఆరోగ్యం క్షీణించి, చలనశీలత తక్కువగా ఉన్నప్పటికీ, ఆమె మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని(Jubilee Hills Assembly Constituency) వెంగల్ రావు నగర్ డివిజన్ నివాసి అయిన దేవమ్మ మధ్యాహ్నం సమయంలో ఓటు వేయడానికి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన పోలింగ్ బూత్ సిబ్బంది ఆమెకు వీల్‌చైర్‌ను అందించి, ఆమె ఓటు వేయడానికి సహాయం చేశారు. ఆమె వృద్ధాప్యంలో, ఆరోగ్యం అనుకూలించని సమయంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలనే ఆమె దృఢ సంకల్పం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి విధికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాని పోటీ దారులు మాగంటి సునీత, నవీన్ యాదవ్, లంకల దీపక్ రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసుఫ్‌గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నటుడు తనికెళ్ల భరణి(Actor Tanikella Bharani) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్ పేట్ లో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబతో  కలిసి ఓటేశారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్(BRS candidate Maganti Sunitha Gopinath) పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసుల నిష్క్రియాత్మకతపై ఆగ్రహం వ్యక్తం చేసిన సునీత, కాంగ్రెస్ రౌడీయిజాన్ని చట్ట అమలు అధికారులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరించారని ప్రశ్నించారు. మంగళవారం పోలింగ్ సమయంలో ఏర్పాట్లను పరిశీలించడానికి బోరబండ డివిజన్‌లోని పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించకుండా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాగంటి సునీత అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ... బోరబండలో సీఐ కూడా కాంగ్రెస్ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారని, తాము పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే, పోలీసులు మమ్మల్ని వీడియోలు తీస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి పోలీసులు వారికి సపోర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మాగంటి సునీత మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లను బెదిరిస్తుంటూ పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని సునీత ప్రశ్నించారు.