సిరిసిల్లలో టీఆర్‌ఎస్ జెండా పండుగ
- నేరేళ్ల బాధితులకు న్యాయం చేస్తాం
- ఎమ్మెల్యే కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత విమర్శలు
సిరిసిల్ల, జూన్ 18 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ జెండా పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి నాయకులకు ఘన స్వాగతం పలికాయి. సిరిసిల్ల చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా లో పార్టీ జెండాను ఆవిష్కరించి సభ నిర్వహించారు.
సభలో మాట్లాడిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సిరిసిల్ల ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే తీరిక ఎమ్మెల్యేకు లేదని, సెస్‌ను ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ రైతుల ప్రయోజనాల కోసం స్పందించలేదన్నారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు పూర్తిస్థాయిలో అందలేదని ఆరోపించారు.
చేనేత కార్మికులకు పథకాలు అమలు కాలేదని, ఉపాధి లభించడం లేదని, దీంతో వలసల పరిస్థితి నెలకొందన్నారు. నెరేళ్ల బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, ఆదు కుంటామన్న నాయకులు హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసమే తెలంగాణ రక్షణ సేనను స్థాపించానని కవిత అన్నారు. వసిరిసిల్లలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.






