15 April, 2026 | 6:23 AM

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం

28-02-2026 10:15 AM

నీటితోట్టిలో మూడు నెలల పసికందు అనుమానాస్పద మృతి.

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలోని(Nagarkurnool) బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల బాలుడు నీటి తొట్టిలో(Water Tank) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొనడంతో బాలుడి తల్లి నీలమ్మ తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో విభేదాల విషయమై మాట్లాడేందుకు భర్త కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి పాలెం గ్రామానికి వచ్చినట్లు సమాచారం.

అర్ధరాత్రి సమయంలో బాలుడికి పాలు ఇవ్వడానికి చూసుకున్న తల్లికి బాబు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఇంటి పరిసరాల్లో వెతకగా నీటి తొట్టిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతికి తండ్రే కారణమని అనుమానిస్తూ తల్లి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని నాగర్‌కర్నూల్ జనరల్ ఆసుపత్రికి(Nagarkurnool General Hospital) తరలించారు. తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.