రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు.. వేములవాడ దేవస్థానానికి విశిష్ట గుర్తింపు
వేములవాడ, మార్చి 19,(విజయక్రాంతి )హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ప్రతిభావంతులు పురస్కారాలు అందుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వరగారి సురేష్, నాదస్వర కళాకారుడు నూగూరి శ్రీనివాస్ తమ సేవలకు గుర్తింపుగా ఉగాది పురస్కారా లు అందుకున్నారు. ఈ అవార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎం. హనుమంతరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.పురస్కారాలు అందుకున్న దేవస్థానం సిబ్బందిని ఆలయ ఈఓ రమాదేవి అభినందిస్తూ, వారి సేవ లు ఆలయ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని తెలిపారు.ఈ పురస్కారాలతో వే ములవాడ దేవస్థానం ఖ్యాతి మరింత పెరిగిందని భక్తులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.




