అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్: ముగ్గురు విద్యార్థులు మృతి
19-08-2024 01:11 PM
కోటవురట్ల : అనకాపల్లి జిల్లా కోటవురట్ల కైలాసపట్నం అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. అనాథాశ్రమంలో 27 మంది విద్యార్థులు సమోసాలు తిన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థులు జాషువా, భవాని, శ్రద్ధ మృతిచెందారు. మిగితా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం నలుగురిని విశాఖలోని కేజీహెచ్ కు తరలించారు. విద్యార్థుల మృతి ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.






