calender_icon.png 18 February, 2026 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పీఠం ఎవరికి దక్కేనో..

16-02-2026 12:00:00 AM

చైర్పర్సన్ కోసం ముగ్గురు మహిళలు ప్రయత్నాలు

జనరల్ మహిళ కావడంతో పోటీ ఎక్కువ

బిచ్కుంద, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్, చైర్పర్సన్ స్థానాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ దక్కించుకోనుంది. జనరల్ మహిళ రిజర్వేషన్ రావడంతో పోటీ నెలకొంది. మెజార్టీ కౌన్సిలర్ లు అధికార పార్టీకి చెందిన వారు గెలుపొందడంతో చైర్ పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించు కోనుంది.

ఇప్పటివరకు గ్రామపంచాయతీగా సర్పంచ్, వార్డు సభ్యులు గా ఉండగా ప్రస్తుతం  మొదటిసారిగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని బిచ్కుంద మున్సిపాలిటీగా మారింది. మున్సిపాలిటీ ఏర్పాటు అయిన తర్వాత మొదటిసారిగా ఈ బిచ్కుంద మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొని 12 స్థానాల్లో పది స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుని పీఠం వరకు కదులుతున్నారు. ఎన్నికల ముందు రమేష్ షెట్కార్ సతీమణి సీమ షెట్కార్ కు మున్సిపల్ చైర్పర్సన్ గా ఇవ్వడానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే హామీ మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ గా సీమా షెట్కర్ కు ఇవ్వవలసి ఉంది. కానీ పీఠాధిపతి సోమయ్య అప్ప అన్నయ్య కూతురు మఠo మానస కూడా తనకే మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కావాలంటూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మఠం మానసకు కచ్చితంగా మున్సిపల్ స్థానం దక్కించుకోవాలదే ప్రయత్నంలో పీఠాధిపతి సోమయ్యప్ప, మంత్రులతో, ఎమ్మెల్యే పై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. 

మఠం మానసకు మున్సిపల్ చైర్పర్సన్ పదవి  అదీష్టానం ఖరారు చేస్తుందా లేదా తేలాల్సి ఉంది.కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా కృషి చేసిన మల్లికార్జున అప్ప కుమారుడి రమేష్ షట్కార్ భార్య అయిన సీమ షెట్కార్ కు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇవ్వాలని జుక్కల్ నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేకు కోరుతున్నారు. వీరి ఇద్దరి మధ్య మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం పోటీ జరుగుతుంటే తెరపైకి దర్పల్ కార్తిక సంతోష్ వచ్చింది. కార్తిక సైతం తనకు మున్సిపల్ చైర్ ర్సన్ పదవి ఇవ్వాలని కోరుతుంది.

బిచ్కుంద మున్సిపల్ చైర్ పర్సన్ పదవి స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేతి నుండి పోయి అధిష్టానం వరకు వెళ్ళింది. అధిష్టానం నిర్ణయం మేరకే బిచ్కుంద మున్సిపల్ చైర్పర్సన్ ముగ్గురిలో ఒకరికి ఎవరికో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం జరిగే మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎవరికి ఇవ్వాలో అధిష్టానం సీల్ కవర్ లో బిచ్కుందకు పంపిన తర్వాతే పేరు ఖరారు కానుంది. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.