నెహ్రూ జూ పార్కులో పులి అభిమన్యు మృతి
15-05-2024 01:04 AM
అనారోగ్యమే కారణమని అధికారుల వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (విజయక్రాంతి): నెహ్రూ జూ పార్కులో పులి (బెంగాల్ టైగర్ మేల్) ‘అభిమన్యు’ మృతిచెందింది. 2015లో జూ పార్కులో జన్మిం చిన బెంగాల్ టైగర్ వయసు ప్రస్తుతం 9 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్యం బారినపడిన అభిమన్యు, పూర్తిగా నడవలేని స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో జూ పార్కుకి సంబంధించిన వెటర్నరీ వైద్యు లు, పులుల సంరక్షకులు, ప్రొఫెషనల్స్ అభిమన్యుకి పలు రకాల పరీక్షలు జరిపి మె రుగైన చికిత్స అందించడంతో పాటు ఏడాది కాలంగా జాగ్రత్తగా సంరక్షించారు. కానీ పూర్తిగా ఆరోగ్యం క్షీణించిపోయిన పులి మంగళవారం మధ్యాహ్నం మృతిచెందినట్లు జూ పార్కు అధికారులు వెల్లడించారు.




