4 April, 2026 | 8:30 PM

వృద్ధుడి గొంతులో మటన్ బొక్క

15-05-2024 01:01 AM

గుండెకు సమీపంలో ఆహారనాళంలో ఇరుక్కున్న వైనం

ఎండోస్కోపీతో బయటికి తీసిన కామినేని వైద్యులు

ఎల్బీనగర్, మే 14: ఓ వృద్ధుడి గొంతులో ఇరుకున్న ఇరుక్కున్న మటన్ బొక్కను శస్త్ర చికిత్స ద్వారా కామినేని వైద్యులు తొలగించారు. వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణికి చెందిన 66 ఏండ్ల వృద్ధుడు నెల రోజుల క్రితం మాంసాహారం తిన్నాడు. ఆ వృద్ధుడికి దంతాలు లేకపోవడంతో నేరుగా మింగుతున్నాడు. ఈ క్రమంలో 3.5 సెం.మీ. పొడవు ఉన్న మటన్ ఎముకను తిన్నాడు. ఆ సమయంలో ఎలాంటి సమస్య రాలేదు. మూడు రోజుల తర్వాత ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక వైద్యులకు  చూపించినా ఫలితం లేదు. అనంతరం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానలో చేర్పించారు. వైద్యపరీక్షలు చేసి వృద్ధుడి గుండె సమీపంలో ఆహారనాళంలో మాంసం బొక్క ఉన్నట్లు వైద్యులు గుర్తించి, ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. డాక్టర్ రాధిక నిట్టల్ ఆధ్వర్యంలోని వైద్యబృందం ఎండోస్కోపీ విధానంలో ఆహారనాళానికి రంధ్రం చేసి దాన్ని తొలగించారు.