05-12-2024 11:44:33 AM
కౌటాల మండలంలో మేకల పై దాడి
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయ క్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం రన్వెల్లి గ్రామానికి సమీపంలో గల కుర్తా వద్ద రాత్రి సమయంలో పెద్ద పులి మేకల దొడ్డిలో చొరబడి ఒక్క సారిగా దాడి చేయడంతో రన్ వెల్లి గ్రామానికి చెందిన దండిగ బాపు, బింకర్ శంకర్, రామగిరి శంకర్ లకు చెందిన 23 మేకలను పెద్దపులి చంపివేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలో పులి ప్రతిరోజు ఏదోచోట కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు జంకాల్సిన పరిస్థితి నెలకొంది.