05-12-2024 12:53:12 PM
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
బైక్ ర్యాలీ కి బిజెపి జిల్లా అధ్యక్షుడు కొత్తపెళ్లి శ్రీనివాస్ తో కలిసి హాజరు
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రజలకు హామీలను విస్మరించిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యం, 6 అబద్ధాలు 66 మోసాలపై కాగజ్ నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 420 హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీ ల పేరిట అందరిని మోసం చేశారని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంగ సత్యనారాయణ ధోని శ్రీశైలం, ప్రసాద్ లోయ, హనుమంతరావు, కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు.