calender_icon.png 4 December, 2024 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాప్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి

03-11-2024 01:52:13 AM

రైతులను అప్రమత్తం చేసిన అటవీ శాఖ అధికారులు

భైంసా, నవంబర్ 2: ముథోల్ నియోజకవర్గం కుంటాల మండలంలోని సూర్యా పూర్-అంబుగాం గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి శనివారం ట్రాప్ కెమెరాకు చిక్కిందని ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్ తెలిపారు. సారం గాపూర్ మండలం నుంచి మహారాష్ట్ర సరిహద్దు అప్పారావుపేట, మలక్‌జాం అటవీ ప్రాంతాల నుంచి శుక్రవారం కుంటాల మండలం సూర్యాపూర్ అడవిలోకి వచ్చిన పెద్దపులి ఓ కోడెదూడను చంపిన విషయం తెలిసిందే.

ఈ మేరకు అటవీశాఖ అధికారులు పులిని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను అమర్చగా పులి దాడిచేసి చంపిన కోడె కలేబరం వద్దకు శనివారం మరోసారి వచ్చిందని, అది మగ పులి కావచ్చని పేర్కొ న్నారు. ఈ మేరకు ఎఫ్‌బీవో హరిలత, సిబ్బందితో కలిసి శనివారం సూర్యాపూర్, మెదన్‌పూర్, అంబుగాం గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడి అప్రమత్తం చేశారు.

పులిని చంపేందుకు ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పులిదాడిలో హతమైన కోడెదూడ విలువ రూ.25వేలు ఉంటుందని, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.