5 March, 2026 | 1:53 PM

ఎట్టకేలకు గని ప్రమాదంగా నమోదు

05-03-2026 12:20 PM

విజయక్రాంతి వార్తకు స్పందన..

జీఎం రాధాకృష్ణ అధికారులకు చివాట్లు..

శాంతిఖని గని ప్రమాదంపై ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్ డైరెక్టర్ కు ఫిర్యాదు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఎట్టకేలకు శాంతిఖని గని ప్రమాదంపై కార్పొరేట్ యజమాన్యం స్పందించింది. ఓ ప్రధాన అధికార యూనియన్ అగ్రనేత జోక్యంతో గని ప్రమాదంపై ఉన్నతాధికారుల్లో శీగ్రగతిన కదలిక వచ్చింది. బెల్లంపల్లి శాంతిఖనిలోఇటివల జరిగిన ప్రమాదంలో కోట మనికేశ్వర్ అనే బదిలీ కార్మికుడు గాయపడ్డాడు. ఈ సంఘటనలో అతని చేతి వేలు కు తీవ్రంగా గాయం అయింది. ఈ సంఘటనపై గతనెల 22న" కార్మికుల ప్రాణాలతో చెలగాటం" అనే శీర్షికతో విజయ క్రాంతి దినపత్రికలో(Vijayakranthi Newspaper) ప్రచురితమైన కథనం తెలిసిందే.

ప్రమాదంలో గాయపడిన కార్మికుడికి అధికారులు రిపోర్టు రాయకుండా దాటవేశారు. ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదాన్ని అధికారులు ఉద్దేశపూర్వకంగానే గని ప్రమాదంగా నమోదు చేయలేదన్న ఆరోపణన్నాయి. గనీలో సైడ్ పాలై చేతివేళ్ళకి బొగ్గుపెల్ల తగిలి తీవ్ర గాయమైన ఈ ఘటనను అధికారులు అస్సలు పట్టించుకోలేదు. కార్మికుడు అతని తండ్రి గని ప్రమాదంగా నమోదు చేయాలని గొడవ చేసినప్పటికీ అధికారులు బెదిరించి రిపోర్టు రాయకుండానే ఆసుపత్రికి పంపించారు. ఈ సంఘటన పట్ల అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.

నిలో గాయపడిన కార్మికుని ఉదాంతంపై విజయక్రాంతి(Vijayakranthi) పత్రికలో వచ్చిన వాస్తవ కథనంతో అధికారుల బాగోతం వెలుగు చూసింది. విషయాన్ని స్థానిక ఓ కార్మిక నేత, ఐ ఎన్ టీ యూ సీ సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన స్పందించి  రెండు రోజుల క్రితం డైరెక్టర్తో నేరుగా మాట్లాడారు. గనుల్లో కార్మికుల పట్ల అధికారులకు తీరు, గని ప్రమాదాలు జరిగితే రిపోర్ట్ రాయకుండా కార్మికులకు అన్యాయం చేస్తున్నారని అధికారుల వ్యవహారాన్ని ఐఎన్టీయూసీ నేత జనక ప్రసాద్ డైరెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లి కార్మికుడికి న్యాయం జరిగేలా ప్రయత్నించారు. తమ దృష్టికి వచ్చిన కార్మికుడి ఉదాంతంపై డైరెక్టర్లు వెంటనే స్పందించి మందమర్రి జీఎం రాధాకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రమాదంపై అధికారులు రిపోర్టు నమోదు చేయాలని ఉన్నతాధికారుల  ఆదేశాలతో శాంతిగని అధికారులు ఆఘమేఘాల మీద గని ప్రమాదంగా నమోదు చేశారు. 

గనిలో దిగిన జీఎం రాధాకృష్ణ ..

గనిలో జరిగిన ప్రమాదం, కార్మికుడి పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై జీఎం రాధాకృష్ణ మండిపడ్డారని తెలిసింది.  డైరెక్టర్ ఆదేశాల మేరకు జీఎం రాధాకృష్ణ శాంతిగనిలో దిగి గని ప్రమాదం జరిగిన 37 లేవలో నీ పని స్థలాన్ని పరిశీలించారు. గని ప్రమాదం జరిగిన తీరును స్వయంగా పరిశీలించి అధికారులను మందలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రిపోర్ట్ ఎందుకు రాయ లేదని సంబంధిత అధికారిపై జిఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ప్రతి ప్రమాదంపై రిపోర్టు రాయడం సంబంధిత అధికారి బాధ్యత అని, ఎందుకిలా వ్యవహరిస్తున్నారని జిఎం శాంతిఖని అధికారులను తీవ్రంగా మందలించినట్లు తెలిసింది.  ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా నడుచుకోవాలని వారిని జిఎం గట్టిగానే హెచ్చరించినట్లు తెలిసింది. గని ప్రమాదంలో గాయపడి చేతివేలు ను  కోల్పోయిన కోట మణికేశ్వరు ప్రస్తుతం రామకృష్ణాపూర్ సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏదేమైనా ప్రమాదంలో గాయపడినా బదిలీ కార్మికుడు మనికేశ్వర్ కు కొంత ఆలస్యమైనా న్యాయమే జరిగింది.

ఈ విషయం పై  అదికారులు ముందే బాధ్యతతో పనిచేస్తే ఇంత వరకు వచ్చేది కాదనీ శాంతిఖని కార్మికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదంలో గాయపడి చేతివేలును కోల్పోయిన చివరికి ప్రమాదం రిపోర్టు నమోదుకు కారణమైన ఐఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్, సింగరేణి ఉన్నతాధికారులకు బాధిత కార్మిక కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉంటే గని జరిగిన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జనక్ ప్రసాద్ లాంటి అగ్ర నేత స్పందిస్తేగాని అధికారుల్లో కదలిక వచ్చేపరిస్థితి మారాలని కార్మికులు భావిస్తున్నారు.