31 July, 2026 | 5:01 PM

ముఖ్యమంత్రి పర్యటనకు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు

03-09-2025 12:38 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2 ,(విజయక్రాంతి) అధికారులు సిబ్బంది తమకు కే టాయించిన విధులను భాద్యతతో సక్రమం గా నిర్వర్తించాలనీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన బం దోబస్తు ఏర్పాట్లను చేయడం జరిగిందన్నా రు. చంద్రుగొండ మండలంలో జరగబోయే కార్యక్రమానికి బందోబస్తు విధులు నిర్వర్తించడానికి విచ్చేసిన అధికారులు సిబ్బందితో చంద్రుగొండలోని లక్ష్య గార్డెన్స్ నందు సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలను చేశారు.

సుమారుగా 1200 మంది పోలీసులతో ముఖ్యమంత్రి గారి పర్యటనకు బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అధికారులు,సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాలలో బాధ్యతగా విధులు నిర్వర్తించి ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై ముందస్తుగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూ చించారు.సమావేశానికి హాజరయ్యే ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్బంగా కోరారు.

ఉదయం 10నుండి సాయంత్రం 5 గంటల వరకు వి యం బంజర నుండి కొత్తగూడెం వైపుకు వెళ్లే వాహనాలు కల్లూరు,తల్లాడ,ఏన్కూర్ , జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం వైపు వెళ్లాలని సూచించారు.అదేవిధంగా కొత్తగూడెం నుండి వి యం బంజర వైపు ప్రయా ణించే ప్రయాణికులు ఏన్కూర్,తల్లాడ, క ల్లూరు మీదుగా వెళ్లాలని తెలిపారు. సామా న్య ప్రజానీకానికి ట్రాఫిక్ సమస్యలు కలగకుండా పోలీసు వారు చేపట్టిన ట్రాఫిక్ డై వర్షన్ ను పాటించి,వాహనదారులు పోలీ సు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.