31 July, 2026 | 5:44 PM

లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వాళ్లను ఏం చేయాలి?

03-09-2025 12:38 AM
  1. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత తేల్చి చెప్పింది 
  2. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 
  3. కేసీఆర్‌కు కోర్టు బ్రేక్ మాత్రమే ఇచ్చింది 
  4. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) : లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వాళ్లను ఏం చేయా లని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. సీబీఐ విచారణ ఇంకా ప్రారంభం కాకుం డానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పిందన్నారు. హరీశ్‌రావు, సంతోష్ రావు అవినీతి చేశారని కవిత మొదటి సాక్ష్యం చె ప్పిందని, కేసీఆర్ డైరెక్షన్‌లోనే హరీశ్‌గతంలో పనిచేశారని, ఆయన డైరెక్షన్‌లోనే అవినీతి జరిగింద న్నారు.

మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం నిజాం న వాబు స్థాయిలో ధనికులు కావాలని పోటీ పడిందన్నారు. నిజాం కట్టిన పోచారం ప్రాజెక్టుపై నుం చి వరద పోయినా నిటారుగా నిలబడిందని, కాళేశ్వరం కట్టి  ఐదేళ్లు కాకుండానే కూలిపోయింద న్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును ఇతర దేశా ల్లో కడితే చర్యలు అత్యంత తీవ్రంగా ఉండేవని అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ప్రాజెక్టు కూలిపోయి నా నీళ్లు వస్తున్నాయని బీఆర్‌ఎస్ నాయకులు పిచ్చి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎ మ్మెల్యే వీరేశం మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అష్టదిగ్భందనంలో ఉందని, భయంతో కోర్టులకు పరుగులు పెడుతోందన్నారు.  కాళేశ్వరంపై విచారణకు కోర్టు బ్రేక్ మాత్రమే ఇచ్చిందన్నారు. అప ర మేధావి కేసీఆర్ ఎందుకు విచారణకు భయపడుతున్నారని, అవినీతి జరగలేదని కేసీఆర్ భావి స్తే అసెంబ్లీకి ఎందుకు రాలేదో చెప్పాలనారు.

కేసీఆర్ మోహం చాటేయడంతోనే ఆయన అవినీతికి పాల్పడినట్లు అర్థమవుతోందన్నారు. కేసీఆర్ నే రం చేయకపోతే విచారణ సంస్థలకు ఎందుకు జంకుతున్నాడో చెప్పాలని వీరేశం డిమాండ్ చేశా రు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కోసం రూ. 12 వేల కోట్ల ఖర్చు చేసిన తర్వాత రద్దు చేసి కాళేశ్వరం తీసుకువచ్చాడని గుర్తు చేశారు. ఘోష్ కమిషన్ నివేదికను చెత్త బుట్టలో వేయాలని, సీబీఐ విచారణను ఆపాలని కేసీఆర్ ప్రయత్నం చేయడం సరి కాదన్నారు.

కాళేశ్వరంపైన అత్యంత పారదర్శకం గా అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు. బీఆర్‌ఎస్  వద్ద వెయ్యి కోట్ల డిపాజిట్లు, వేల కోట్ల అవినీతి డబ్బు ఉందని, ఆ పంపకాల్లోనే పంచాయితీ వ చ్చిందన్నారు. కల్వకుంట్ల కుటంబంలోని పంచాయితీని సీఎం రేవంత్‌రెడ్డికి ముడిపెట్టడం వాళ్ల అమాయకత్వమన్నారు. కేసీఆర్ నేరాలకు ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.