27 June, 2026 | 7:04 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి

04-12-2025 10:28 PM

గ్రామ పంచాయతీ ఎన్నికలలో పటిష్ట బందోబస్తు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోడ్‌పై  ప్రజలకు అవగాహనలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి  

మంథని (విజయక్రాంతి): జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొవాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోడ్‌పై ప్రజలకు అవగాహనలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. బుధవారం ముత్తారం, రామగిరి మండలంలోని గ్రామాలలో గోదావరిఖని ఏసిపి మడత రమేష్, మంథని సిఐ రాజుతో కలిసి పాల్గొన్నారు.

ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, ఓడేడు, అడవి శ్రీరాంపూర్, కేశనపల్లి, రామగిరి మండలంలోని రామయ్యపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) పై అవగాహన కార్యక్రమాన్ని ముత్తారం ఎస్ఐ రవి కుమార్, సిబ్బందితో గ్రామాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీసీపీ పాల్గొని మాట్లాడుతూ స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, గొడవలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు జరగాలని దానికి అందరూ పోలీస్ వారికీ సహకరించాలని, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పెద్దపల్లి జోన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల వాటి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పటిష్టమైన బందోబస్తులు నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, నిషేధిత చర్యలు, డబ్బు మద్యం పంపిణీ, బెదిరింపులు, పోలింగ్ బూత్ ల వద్ద ప్రభావం చూపే చర్యలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు.

ఎలాంటి అక్రమ చట్ట వ్యతిరేకమైన, ఎన్నికల ఉల్లాంఘాన చర్యలు జరిగిన వెంటనే  డయాల్ 100, స్థానిక పోలీస్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు కోరారు. ఎవ్వరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులకు గొడవలకు పాల్పడ కుండా అభ్యర్థులు, గౌరవించాలని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, హింసాత్మక చర్యలు, ప్రతిష్టాభంగ ప్రచారాలు చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో ప్రసారం చేస్తే కేసులు నమోదు చేస్తామని, సోషల్ మీడియా ద్వారా హానికరమైన ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు షేర్ చేసిన కూడా బాధ్యులపై చర్యలు తప్పమన్నారు. రాత్రి వేళలో గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించవద్దని, నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. డీసీపీ వెంట ముత్తారం ఎస్ఐ రవి కుమార్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.