04-12-2025 10:30:07 PM
అంబేద్కర్ యువజన సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్..
హనుమకొండ (విజయక్రాంతి): భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈనెల 6న ప్రతి గ్రామంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అంబేద్కర్ యువజన సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బూజుగుండ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో ప్రతి యువత జ్ఞానాన్ని పెంపొందించుకొని, చదివే ఆయుధంగా చేసుకుని, సబ్బండ వర్గాల ప్రజలు రాజ్యాధికార దిశగా పయనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిద్దెపాక ఎల్లయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొమ్మల అంబేద్కర్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ల రవీందర్, జగపతి, హనుమకొండ జిల్లా ప్రచార కార్యదర్శి మేకల ప్రవీణ్, జిల్లా సాంస్కృతిక కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.