calender_icon.png 4 December, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం జిల్లా పర్యటన రోజే బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

04-12-2025 10:23:30 PM

గులాబీ కండువాలను కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

నేరడిగొండ (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన నాడు కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారంటే ఆ పార్టీ నేతలకు కాంగ్రెస్ పై ఏమాత్రం నమ్మకం ఉందో అర్థం అవుతోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎద్దేవ చేశారు. జిల్లాను దత్తత తీసుకున్నారు అని చెప్పి రెండేళ్లు పూర్తయినా ఇంకా జిల్లా అభివృద్ధి పై క్లారిటీ లేదన్నారు. మండలంలోని బుద్దికొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కళ్లెం నరోత్తం రెడ్డి, ఆశ రెడ్డ,  లక్ష్మ రెడ్డి, నల్ల నరేష్ రెడ్డి లు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఆదిలాబాద్ లో సభ నిర్వహించారని ఆ సభతో స్థానిక ఎన్నికలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, లవ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.