భారత్ ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ
వైభవ్ సూర్యవంశీకి చోటు
శ్రీలంకలో ట్రై సిరీస్
ముంబై, మే 14 : వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరిగే ట్రై సిరీస్ కోసం భారత్ ఏ జట్టును ప్రకటించారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రియాన్ పరాగ్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకున్నాడు. గత ఆరు నెలలుగా వైభ వ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
గత సీజ న్ ఐపీఎల్, ఈ ఏడాది అండర్ 19 ప్రపంచకప్‌లోనూ సత్తా చాటాడు. ఫైనల్లో 175 రన్స్ చేసి భారత్ అండర్ 19 జట్టును విజేతగా నిలిపాడు. అదే ఫామ్‌ను ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వ రకూ 11 మ్యాచ్‌లలో 440 పరుగులు చేశా డు. దీనిలో 40 సిక్సర్లున్నాయి. త్వరలోనే టీమిండియాలోకి తీసుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సిరీస్ వైభవ్‌కు మంచి అవకాశంగా చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ఐపీఎలో రాణిస్తున్న ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అన్షుల్ కాంబోడ్, సూర్యాంశ్ వంటి యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు లభించింది. భారత్, శ్రీలంక ఏ జట్లతో పాటు ఆప్ఘ నిస్థాన్ ఏ జట్టు ఈ టోర్నీలో ఆడనుంది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ ట్రై సిరీస్ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జ రుగుతుంది. ఇదే టూర్‌లో భారత్ ఏ జట్టు శ్రీలంక ఏ జట్టుతో మల్టీ డే మ్యాచ్‌లు కూ డా ఆడనుంది. వైట్‌బాల్ సిరీస్ దంబుల్లా లో, రెడ్ బాల్ మ్యాచ్‌లో గాలే వేదికగా జరగనున్నాయి.
ట్రై సిరీస్‌కు భారత్ ఏ జట్టు :
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభ వ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అంశుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్






