15 May, 2026 | 2:00 AM

స్పోర్ట్స్ ఎక్స్‌పో పోస్టర్ ఆవిష్కరణ

15-05-2026 12:55 AM

హైదరాబాద్, మే 14: ఈనెల 24న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా కుంచెట్టి కేల్ క్షేత్ర ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న స్పోర్ట్స్ ఎక్స్ పో పోస్టర్‌ను శ్రీశ్రీ త్రి దండి చిన్న జీయర్ స్వామి ఆవిష్కరించారు.

మిషన్ 2030 కామన్ వెల్త్‌గేమ్స్, మిషన్ 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా చేసుకుని పిల్లలను క్రీడల వైపు మళ్లించేందుకు 22 ఒలింపిక్ స్పోర్ట్స్ అసోసియేషన్ల సహకారంలో ఈ స్పోర్ట్స్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్టు కుంచెట్టి కేల్ క్షేత్ర సీఈఓ భవాని ప్రసాద్ చెప్పారు. క్రీడల్లోకి రావాలనుకునే వారికి గైడెన్స్ ఎలా ఉండాలి, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఎలాంటి కోచింగ్ తీసుకోవాలనే అంశాలపై అన్ని సలహాలు సూచనలు ఈ స్పోర్ట్స్ ఎక్స్‌పో ద్వా రా లభిస్తాయని మహేశ్వర్ చెప్పారు.

చిన్నజీయర్ స్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలిపారు. పిల్లల కో సం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయనీ, గెలిచిన వారికి ప్రోత్సహకంగా కొన్ని బహమతులు అందజేయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ క్రీడాకారులు, ఫెడరేష న్ అధ్యక్షులు, కార్యదర్శులు సందర్శకులకు వారి సలహాలు సూచనలు అందించబోతున్నారు. క్రీడా ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్పోర్ట్స్ ఎక్స్ పో సందర్శించాలని ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి వివరాల కోసం 7672012224, 964026 2224 నెంబర్లను సంప్రదించాలన్నారు. స్పోర్ట్స్ ఎక్స్‌పో సందర్శనకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.