calender_icon.png 11 January, 2026 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిలక్‌వర్మకు సర్జరీ

09-01-2026 12:00:00 AM

కివీస్‌తో సిరీస్‌కు దూరం

టీ20 ప్రపంచకప్‌కూ డౌటే

రాజ్‌కోట్, జనవరి 8 : అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ కు ఇంకా నెల రోజులే టైముంది. ఈ మెగా టోర్నీకి ముందు భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ టీ20 ప్రపంచకప్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజ య్ హజారే ట్రోఫీ ఆడుతున్న తిలక్ అనూహ్యంగా అనారోగ్యానికి గురయ్యాడు. జ మ్మూ కాశ్మీర్ తో మ్యాచ్ సందర్భంగా తిలక్ కు వృషణాల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్ళి స్కానింగ్ చేయించారు. తిలక్ కు టెస్టిక్యులర్ టోర్షన్ గా నిర్థారణ కావడంతో ఎమర్జెన్సీ సర్జరీ చే శారు. సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్టు డాక్టర్లు తెలిపారు.

ప్రస్తుతం ఈ యువ క్రికెటర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు హైదరాబాద్ జట్టు వర్గాలు తెలిపాయి. అయితే తిలక్ వర్మ మళ్లీ క్రికెట్ ఆడేందుకు సమ యం పట్టనుంది. ఎంతకాలం రెస్ట్ అవసరమన్నది తెలియకున్నా న్యూడిలాండ్‌తో టీ20 సిరీస్‌కు అతను దూరమవడం ఖాయమైంది. అదే సమయంలో ఫిబ్రవరి మొదటి వారం నుంచి మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండడంపైనా అ నుమానాలు నెలకొన్నాయి. ఫిబ్రవరి 7 నుంచి భారత్ , శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరుగుతుంది. ఒకవేళ తిలక్ ప్రపంచకప్‌కు దూరమైతే మాత్రం టీ మిండియాకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి.