calender_icon.png 11 January, 2026 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్ట్రేలియాదే యాషెస్ చివరి టెస్ట్

09-01-2026 12:00:00 AM

4 సిరీస్ కైవసం

సిడ్నీ, జనవరి 8 : యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో కంగారూలు 5 వికెట్ల తేడాతో గెలిచారు. ఒకానొక దశలో వరుస వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మిడిలార్డర్ బ్యాటర్లు అలెక్సీ క్యారీ, కామెరూన్ గ్రీన్ నిలబెట్టడంతో మ్యాచ్ గెలిచింది. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4 కైవసం చేసుకుంది. 302 ప రుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మరో 40 పరుగులే చేయగలింది.

ఆస్ట్రేలియాకు విజయానికి కేవలం 159 పరుగులు మాత్ర మే కావాల్సి వచ్చింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, వెదరాల్డ్ మంచి భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత ఆసీస్ వెంట వెంటనే మరో 3 వికెట్లు చేజార్చుకుంది. విజయానికి 39 పరుగులు కావాల్సిన సమ యంలో క్యారీ, గ్రీన్ ఇద్దరూ కలిసి  మ్యాచ్ ముగించారు. మొదటి మూడు టెస్టుల్లో వరుసగా గెలిచిన ఆస్ట్రేలియా నాలుగో టెస్టు లో ఓడిపోయింది. సిడ్నీలో ఇంగ్లాండ్‌ను చి త్తు చేసి యాషెస్‌ను నిలబెట్టుకుంది. మిఛెల్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.