31 August, 2026 | 10:24 AM

Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •   మాదాపురంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు   •  

త్వరలో టీఎన్జీవో 80 వసంతాల సభ

27-06-2025 12:00 AM
  1. లక్ష మంది ఉద్యోగులతో నిర్వహణ
  2. 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలి
  3. ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే పెండింగ్ సమస్యలపై పోరాటం చేస్తాం
  4. మీడియాతో టీఎన్జీవో నేతలు మారం జగదీశ్వర్, ముజీబ్

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): త్వరలో లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో టీఎన్జీవో 80 సంవత్సరాల ఆవిర్భావ సభ నిర్వహిస్తామని టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్, ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్ తెలిపారు. 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేశా రు. టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ప్రభుత్వం తో సఖ్యతగా ఉంటూనే పెండింగ్ సమస్యలు సాధన కోసం పోరాటాలకు వెనకాడదని తెలిపారు.

తెలంగాణ ఎన్జీవో కేంద్ర సంఘం రాష్ర్ట కార్యవర్గ సమావేశం గురువారం నాంపల్లిలోని సంఘం భవన్‌లో జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మారం జగదీశ్వర్, ముజీబ్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం ప్రభుత్వంతో, క్యాబినెట్ సబ్ కమిటీ తో, ఆఫీసర్స్ కమిటీలతో సుదీర్ఘంగా చర్చిం చి ప్రధానంగా పంచాయతీ కార్యదర్శులను గ్రేడులుగా విభజించడం, సచివాలయంలో 12.5 శాతం కోట అమలు, పెండింగ్ బిల్లులకు సంబంధించిన మెడికల్ బిల్లుల మంజూరు, డీఏ ఉత్తర్వులు ఇవ్వడం, కొన్ని శాఖలకు అదనపు పోస్టులను మంజూరు చేయించడం వంటి 16 సమస్యలు పరిష్కారమైనట్టు వివరించారు. 

వీటితోపాటు 2023, జూలై 1 నుంచి 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ డీఏల మంజూరు, పెండింగ్ బిల్లు ల చెల్లింపులు, సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. గచ్చిబౌలి ఇండ్ల స్థలాలను బీటీఎన్జీవో సొసైటీకి కేటా యించాలని, ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంతోపాటు మిగిలిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

సస్పెండయిన ఉద్యోగులను నిబంధనల మేరకు విధుల్లో కి తీసుకోవాలని కోరారు. పలు తీర్మానాల ను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.