17 April, 2026 | 11:50 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

క్రీడాకారులను ప్రోత్సహిస్తేనే గుర్తింపు

27-06-2025 12:00 AM

నేషనల్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): క్రీడాకారులను ప్రోత్సహించిన ప్పుడే ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని నేషనల్ బ్యాట్మింటన్ చీఫ్ కోచ్, జనరల్ సెక్రటరీ ఆఫ్ బ్యాట్ పుల్లెల గోపీచంద్ అన్నారు. గురువారం మేడ్చల్ మల్కాజిగిరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్‌సి ఇండోర్ బ్యాడ్మింటన్ అకాడమీలో జిహెచ్ రైసోని మెమోరియల్ యెనిక్స్ సన్ రైస్ 11వ తెలంగాణ రాష్ట్ర సీనియర్ బ్యాడ్మింటన్ ఛాం పియన్ షిప్ పోటీల మెయిన్ డ్రా జరిగింది.

ఈ సందర్భంగా పుల్లెల గోపిచంద్ మాట్లాడారు. బాడ్మింటన్ క్రీడాకారు లను ప్రోత్సహించాలన్నారు. మేడ్చల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు క్రీడలకు అధిక ప్రాధా న్యం ఇస్తున్నారని చెప్పారు. ఒలంపియన్ ఇంటర్నేషనల్ క్రీడాకారుడు సుమిత్‌రెడ్డి, రైసోని ఫౌండేషన్ డైరెక్టర్ పూనం పాండే, జాయింట్ సెక్రెటరీ ఈవెం ట్స్ అండ్ ప్రోటోకాల్ (బ్యాట్) యువిఎన్ బాబు, బ్యాట్ కోశాధికారి కానూరి వంశీధర్,  టోర్నమెంట్ ఆర్గనైజర్ వికాస్, మేడ్చల్ జాయింట్ సెక్రెటరీ నాగరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.