calender_icon.png 9 May, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ కమిషనర్‌ను కలిసిన టీఎన్జీవో నాయకులు

19-03-2025 01:58:03 AM

కొత్తపల్లి, మార్చి 18: కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న గౌస్ ఆలం గారిని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టి ఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా సిపి గారి చాంబర్లో కలిసి శాలువా పూల గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసి హృదయపూర్వక ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల  జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర సంఘ నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, మహేష్ పట్టణ అధ్యక్షులు రాజేష్ భరద్వాజ్, కర్ణాకర్ మరియు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి శంకరయ్య పాల్గొన్నారు.